Andhra PradeshPrakasham
సిఎస్ పురం ఎస్ఐ అనిల్ కుమార్ వి ఆర్ కు బదిలీ…….ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాలు

సిఎస్ పురం ఎస్ఐ అనిల్ కుమార్ వి ఆర్ కు బదిలీ…….ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాలు
క్యాపిటల్ వాయిస్, కనిగిరి ( ప్రకాశం జిల్లా) ఆగస్టు 3.:- చంద్రశేఖరపురం మండలం ఎస్సైగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయవలసిందిగా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండడంతో పాటు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుల విచారణలో జాప్యం చేస్తున్నారని అనేకమంది నేరుగా ఎస్పీకి విన్నవించారు. బాధితులను స్టేషన్ కు తిప్పుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను వీఆర్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.