సీఆర్పీఎఫ్ ప్రతినిధికి ఫిజికల్ ఫిట్నెస్ బోర్డ్ సభ్యునిగా నియామకం హర్షణీయం:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

సీఆర్పీఎఫ్ ప్రతినిధికి ఫిజికల్ ఫిట్నెస్ బోర్డ్ సభ్యునిగా నియామకం హర్షణీయం:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
దేశ వ్యాప్తంగా ఎన్నో ఏళ్ళుగా బాలల హక్కులు వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) విశాఖ నగర శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.హరీష్ కుమార్ కు నేషనల్ స్పోర్ట్స్ &ఫిజికల్ ఫిట్ నెస్ బోర్డ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సభ్యునిగా కేంద్ర పాలకమండలి నియమించడం హర్షణీయమని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.సోమవారం విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిధి గృహంలో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హరీష్ కు శాలువాతో సత్కరించి పుష్ప గుశ్చం అందించి అభినందనలు తెలిపారు, అనంతరం తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం నేతృత్వంలో బాలల హక్కులు పరిరక్షణ వారి సంక్షేమానికి ఎనలేని సేవలు అందిస్తున్నందుకు గాను గుర్తించి కేంద్ర పాలక వర్గం హరీష్ కు ఈ పదవి కట్టబెట్టడం గర్వించ దగ్గ విషయమన్నారు,మరిన్ని ఖ్యాతినార్జించే పదవులు చేపట్టాలని సూచించారు. సీఆర్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ హరీష్ కుమార్ తమ ఫోరం విశాఖ నగర కార్యదర్శి గాను స్కౌట్స్ మరియు గైడ్స్ సంస్థ ద్వారా ఎన్నో ఏళ్లుగా పిల్లలతో మమేకమై అందిస్తున్న సేవలకు గాను ఈ పదవీ వరించడం ఫోరం నిబద్ధతతో కల్గిన పని తీరుకు గుర్తింపుగా భావిస్తున్నామని అన్నారు,రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వివిధ ఆటల్లోను శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర బోర్డ్ ప్రతినిధులు ఈ నియామకం చేపట్టడం అభినందనీయమని అన్నారు.