కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి…. పూర్తిస్థాయి అధ్యక్షురాలు తానేనని సోనియా గాంధీ స్పష్టం !

కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి…. పూర్తిస్థాయి అధ్యక్షురాలు తానేనని సోనియా గాంధీ స్పష్టం!
సీనియర్ల రచ్చ సరికాదు…
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ ప్రారంభ ఉపన్యాసంలో సోనియా గాంధీ పలు సంకేతాలు, సూచనలు చేశారు. సోనియా గాంధీ అధ్యక్షతన దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతోన్న సమావేశంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలు డిమాండ్ చేస్తూ సోనియాకు లేఖ రాసిన సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్ల రచ్చపై సోనియా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. సీనియర్లు కొందరు సంస్థాగత ఎన్నికల విషయమై బయట వేరే విధంగా మాట్లాడుతున్నారన్నారు. సీడబ్ల్యూసీ భేటీ పై మీడియాతో మరో రకంగా మాట్లాడం సరికాదని సోనిమా గాంధీ అన్నారు. పార్టీ పదవులకు ఎన్నిక అనివార్యమన్న విషయం తనకు తెలుసన్న ఆమె… 2019 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉంటున్నానన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షురాలిగా తానే ఉంటానని సోనియా స్పష్టం చేశారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించే సందర్భం వచ్చిందన్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటనపై సీడబ్ల్యూసీ సమావేశంలో విచారం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలపై బీజేపీ ఆలోచనకు లఖింపూర్ ఘటన నిదర్శనమన్నారు. విదేశాంగ విధానం, సరిహద్దుల్లో పరిస్థితులపైనా సోనియా ఆందోళన వ్యక్తంచేశారు.