చురుగ్గా సాగుతున్న పల్నాటి మాంచాలమ్మ దేవాలయ నిర్మాణ పనులు

చురుగ్గా సాగుతున్న పల్నాటి మాంచాలమ్మ దేవాలయ నిర్మాణ పనులు
క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి, కారంపూడి :- పల్నాటి చరిత్రను నాలుదిక్కులు వ్యాపింపచేయాలన్న ఉద్దేశంతో పల్నాటి చరిత్రలో ముఖ్యమైన మగువ మంచాల ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని డి.వి టౌన్ షిప్ యజమాని డి. వి వెంకటేష్ తెలిపారు.కారంపూడి మండలం లోని పేటసన్నేగండ్ల గ్రామ పరిధిలో గల మిట్టమీద ఆంజనేయ స్వామి గుడి ఎదురుగల చెట్ల పొదల్లో నాటి పల్నాటి రాజ్యానికి మంత్రిగా పనిచేసిన బ్రహ్మనాయుడు కోడలు పల్నాటి బాలచంద్రుని సతీమణి అయినా మాంచాలమ్మా విగ్రహం చెట్ల పొదల్లో ఉండటం గమనించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి శిలను బయటకు తీయటం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరి సహాయ సహకారాలతో ఆ శిల వున్న ప్రదేశం లో ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, త్వరలోనే దేవాలయ పనులు పూర్తి అవుతాయని అయన తెలిపారు . అమ్మవారికి అభిషేకంతో పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమలను పూర్తి చేయటం జరిగిందని ఈ మేరకు రేపటి నుంచి భక్తులు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించుకోవచ్చు అని డి. వి వెంకటేష్ తెలిపారు.