Andhra PradeshChittoor

చిత్తూరు జిల్లా కుప్పం బాదురు జిల్లా పరిషత్ పాఠశాలలో కాల్పుల కలకలం !?

చిత్తూరు జిల్లా కుప్పం బాదురు జిల్లా పరిషత్ పాఠశాలలో కాల్పుల కలకలం !?

క్యాపిటల్ వాయిస్, చిత్తూరు జిల్లా :-  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం కుప్పం బాదురు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎయిర్ గన్ తో కాల్పులు జరిగిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో రెండు బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉన్న ప్లాసిక్ పైపులకు రంద్రాలు పడటం తో పాటు, అక్కడే ద్వారం వద్ద ఉన్న తలపులకు కూడా బులెట్ తగిలిన ఆనవాళ్ళను పోలీసులు పరిశీలించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. చివరకు ఈ కాల్పుల సంస్కృతి ఇక్కడ కూడా వచ్చిందా అని ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!