చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారికి భవిష్యత్తు లో మూల్యం చెల్లించుకుంటారు : చంద్రబాబు.

చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారికి భవిష్యత్తు లో మూల్యం చెల్లించుకుంటారు : చంద్రబాబు.
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) పొన్నూరు :- పొన్నూరు నియోజకవర్గం చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర నివాసం నుండి మీడియాతోచంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్ర.ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి అండగా ఉంటున్నారు.వరుసగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సేవలు అందించారని,రైతుల కోసం నిరంతరం కృషి చేసిన కుటుంబం నరేంద్ర కుటుంబం.ఇలాంటి పరిస్థితి నా నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదని,విలువలు లేని కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకిరు.సంగం, విశాఖ చట్ట ప్రకారం బదిలీ అయ్యాయని అన్నారు .సంగండైరీ ఆధ్వర్యంలో ఒక హస్పిటల్ పెట్టి సేవలు అందిస్తున్నారన్నారు. అలాంటిది రాజకీయ కక్షతో ఏ తప్పు చేయకుండా ముందస్తు నోటీసులు లేకుండా నరేంద్రాని అరెస్ట్ చేశారని అన్నారు .చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారికి భౌవిష్యత్ లో ముల్యం చెల్లించుకోంటారని అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటి అవినీతిని ప్రశ్నించే వారిని ప్రజలను డైవర్స్ చేయడానికి అరెస్ట్ చేస్తున్నారన్నారు. అందరూ వైసీపీ నేతల్లాగా తప్పుడు మనుషులు లేరు.ప్రభుత్వంలో 43వేల కోట్ల రూపాయల అవినీతి చేశారు.ఇప్పుడు చేస్తున్న అవినీతి కి కోర్టు లు కూడా చాలవు. నరేంద్ర గారి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గడిచిన 10సంవత్సరాలదో ఎంత పెరిగాయో ప్రజలు చూడాలి.దర్మం కోసం ప్రజా వ్యతిరేకవిధానాలపై నరేంద్ర పోరాటం చేస్తున్నారు. నరేంద్రని బెదిరించారు. చివరికి అరెస్ట్ చేశారు.ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయవద్దని సుప్రీం చెప్పినా వీళ్లు అరెస్ట్ చేస్తున్నారన్నారు.ఉన్మాది పాలలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారు.రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి… ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారో అలాంటి వారిని వదిలిపెట్టం.రాయలసీమలో గతంలో ఉన్నా హత్యా రాజకీయాలు, ముట్టా కక్షకు చరమగీతం పాడాం.అలాంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుంది.గతంలో మేము ఇదే విధంగా చేస్తే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా…?సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు.దీనిపై కోర్టు అక్షింతలు పట్టాయని అన్నారు.స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో నరేగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తున్నారు.కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం ఏపీలో వాళ్ల సచివాలయం పెడితే ఊరుకోంటారా..?సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా మీ హక్కులను కాపాడుకోవాలి.ఈ సీఎం వ్యవస్థను ఇష్టానుసారంగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. IAS, IPS లను సైతం నిర్వీర్యం చేసారని అన్నారు.ఇప్పుడు సర్పంచ్ లపై పడ్డారు.ఫైనాన్స్ కమీషన్ నేరుగా పంచాయతీలకి నిధులను ఇస్తుందన్నారు.