AGRICULTUREVisakhapatnam
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్వేచ్ఛ కార్యక్రమం ప్రారంభం.

చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్వేచ్ఛ కార్యక్రమం ప్రారంభం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
దేశంలో 23శాతం మంది బాలికల స్కూల్ డ్రాప్ అవుట్లకు కారణం రుతుక్రమ సమయంలో పాఠశాలల్లో వారికి ఎదురవుతున్న ఇబ్బందులు కారణం అని ప్రముఖ సంస్థల సర్వేల నివేదిక ఆధారంగా ఈ సమస్యలకు చరమగీతం పాడుతూ జగనన్న ప్రభుత్వం తీసుకు వచ్చిన విప్లవాత్మక కార్యక్రమం #స్వేచ్ఛ ( కట్టుబాట్ల నుండి స్వేచ్ఛ లోకి ) రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా కిషోర బాలికలకు 32 కోట్ల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాపకిన్లు ఉచితంగా పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిచే వర్చువల్ విధానం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థి కిషోర బాలికలకు పంపిణీ కార్యక్రమం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలిక విద్యార్థుల చదువులో ముందంజలో ఉండాలని ప్రతి నెలలో వచ్చే ఋతుక్రమం వల్ల కొంత బాలిక విద్యార్థులు నష్టపోతూ ఉంటారని వారికోసం సి ఎమ్ జగన్ స్వేచ్చ అనే కార్యక్రమం నేడు ప్రారంభించారని తెలుపుతూ కలెక్టర్ మల్లికార్జున్ కడపనుంచి వైజాగ్ జిల్లా కలెక్టర్ గా వచ్చారని నిరుపేద కుటుంబంలో ముందు డాక్టర్ గా చదువుకొని తరువాత ఐ ఏ ఎస్ గా విశాఖ జిల్లా కి వచ్చారని ఆయన ల జిల్లా పరిషత్ విద్యార్థులు చదువుకొని ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ డాక్టర్లుగా ఎదగాలని నా అకాంక్ష అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం మధురవాడ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి , ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాన్ని విజయనిర్మల, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ బి మీనా,పాఠశాల విద్యార్థినిలు, వైయస్సార్ సిపి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

