సెల్ ఫోన్ పేలింది – నిద్ర లోనే మహిళ కన్నుమూసింది !

సెల్ ఫోన్ పేలింది – నిద్ర లోనే మహిళ కన్నుమూసింది !
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- ఢిల్లీలో విషాదం నెలకొంది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. అర్ధరాత్రి సమయంలో సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు.చాలా మంది నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ ను పక్కనే పెట్టుకుంటారు. అలా చేయడమే ఒక మహిళ ప్రాణాలు తీసింది. ఢిల్లీలో విషాదం నెలకొంది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. వివరాల్లోకి వెళ్తే..సదరు మహిళ రెడ్‌మీ 6ఏ సెల్ ఫోన్ వాడుతోంది. ఈ క్రమంలో రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె.. దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని నిద్రించారు.అర్ధరాత్రి సమయంలో ఆ సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు. దీనికి సబంధించిన వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. కాసేపటికి అది పేలిపోవడంతో ఆమె చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం.మాకు సాయం చేయాల్సిన బాధ్యత బ్రాండ్‌పై ఉంటుంది’ అని అతడు ట్వీట్ చేశారు. దీంతోపాటు పేలిపోయిన సెల్ ఫోన్ ఫొటోలు షేర్ చేశారు. వీటితో పాటు రక్తపు మడుగులో ఉన్న మహిళ ఫొటో కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రెడ్‌మీపై మండిపడుతున్నారు. సదరు కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తాము కూడా విచారణ జరుపుతున్నట్లు రెడ్‌మీ కంపెనీ వెల్లడించింది.