Andhra PradeshVisakhapatnam
క్యాపిటల్ వాయిస్ పత్రికా కథనానికి స్పందించిన సింహాచల దేవస్థానం ఈ ఓ సూర్యకళ.

క్యాపిటల్ వాయిస్ పత్రికా కథనానికి స్పందించిన సింహాచల దేవస్థానం ఈ ఓ సూర్యకళ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం లో ప్రఖ్యాతి గాంచిన సింహాచల దేవస్థానం కి వెళ్లే మెట్ల మార్గం బురదమయం, ఘాట్ రోడ్లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం రంగులు వెలసిపోయి, చెయ్యివిరిగి ఉన్న విగ్రహం అని క్యాపిటల్ వాయిస్ పత్రికలో వచ్చిన కథనం పై ఈ ఓ సూర్యకళ స్పందించి శుక్రవారం మెట్లమార్గం లో కొంతవరకు మెట్లేక్కి పరిశీలించి తక్షణమే బురదను తొలగించాలని ఆదేశాలు జారీ చేసారు. ఆంజనేయస్వామి విగ్రహం కొరకు మాట్లాడుతూ ఆంజనేయస్వామి జయంతి లోపు సరి చేయించి కొత్త రంగులు వేయిస్తామని క్యాపిటల్ వాయిస్ పత్రికా ముఖంగా తెలిపారు. ఇటువంటి లోపాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.