National

బ్రాహ్మణేతరులకు అర్చకులుగా ఉద్యోగాలు కల్పించిన సిఎం స్టాలిన్ – వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ

బ్రాహ్మణేతరులకు అర్చకులుగా ఉద్యోగాలు కల్పించిన సిఎం స్టాలిన్ – వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ

క్యాపిటల్ వాయిస్, జాతీయం :- అన్ని కులాల వారికీ అర్చకత్వం చేసే హక్కు ఉందని, తాము అధికారంలోకి వస్తే అందరికీ అవకాశమిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు స్టాలిన్. దాని ప్రకారమే ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి
వారికి శిక్షణ ఇప్పించారు.ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి వచ్చాక 208 మంది బ్రాహ్మణేతరులకు అర్చకులుగా ఉద్యోగాలిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. వారికి శిక్షణ ఇచ్చి, విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నియామక పత్రాలిచ్చారు. వారంతా విధుల్లో చేరిపోయారు. అయితే స్టాలిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది.అన్ని కులాలవారికీ అర్చకత్వం చేసే హక్కు ఉందని, తాము అధికారంలోకి వస్తే అందరికీ అవకాశమిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు స్టాలిన్.దాని ప్రకారమే ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇప్పించారు. హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌ విభాగంలో 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.స్టాలిన్ నిర్ణయంపై అణగారిన వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే కొంతమంది మాత్రం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో సుబ్రహ్మణ్యస్వామి ఒకరు. తండ్రి కరుణానిధి లాగే, తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం నోటీసుల‌తో ఇప్పుడీ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది.

Attachments area

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!