భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా దుమారం.?
క్యాపిటల్ వాయిస్: విశాఖపట్నం ప్రతినిధి :- భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఆ పార్టీ ఇన్చార్జి కోరాడ రాజబాబు తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొంత కాలం క్రితం కోరాడ రాజబాబును అధిష్టానం నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు . దీంతో ఆయన భీమిలిలో పార్టీ కార్యాలయం ప్రారంభించి పలు కార్యక్రమాలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆనందపురం మండలానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోరాడ నాగ భూషణం టీడీపీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజబాబు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు . దీనికి సంబంధించి అక్కడి నుంచి నాగభూషణంకు షోకాజ్ నోటీసు వచ్చింది. దీనిపై పార్టీలో ఒక్కసారిగా తీవ్ర వ్యతి రేకత వ్యక్తమఉతుంది . పార్టీకి మొదటి నుంచి కట్టుబడి ఉండి ఎంతో సేవ చేసిన నాగభూషణంపై ఫిర్యాదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోరాడ రాజబాబు వ్యవహార శైలి తో భీమిలి లో టీడీపీ నాయకులు తీవ్ర అసమ్మతి తో రగిలి పోతున్నారు. కార్పొరేటర్లు గాదు చిన్నికుమారి లక్ష్మి, గంటా అప్పలకొండ, పిల్లా మంగమ్మ. మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారం, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు, ఆనందపురం మాజీ జెడ్పీటీసీ బమ్మిడి ఉమ, పార్లమెంటరీ పార్టీ జనరల్ సెక్రటరీ పాసర్ల ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర రాము, సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు, పిల్లా వెంకటరావు, దాసరి శ్రీనివాస్ ఇతర నాయకులు తీవ్రంగా వ్యతిరేకస్తున్నామని తెలిపారు.
Back to top button
error: Content is protected !!