భవణనిర్మాన కార్మికుల సంక్షేమ బోర్డ్ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 830 కోట్లు నిధులు తిరిగి బోర్డ్ కు జమచేయాలని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ డిమాండ్

భవణనిర్మాన కార్మికుల సంక్షేమ బోర్డ్ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 830 కోట్లు నిధులు తిరిగి బోర్డ్ కు జమచేయాలని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ డిమాండ్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భవణనిర్మాన కార్మికుల సంక్షేమ బోర్డ్ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 830 కోట్లు నిధులు తిరిగి బోర్డ్ కు జమచేయాలని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ డిమాండ్ చేసింది.సంక్షేమ బోర్డ్ ద్వారా కర్మికులకు అందవలసిన సౌకర్యాలు అందకుండా చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోమ్మాధి కూడలి వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.ఈసందర్భంగా జోన్ అధ్యక్షులు డీ అప్పలరాజు మాట్లాడుతు భవన నిర్మాణ కార్మికులు అనేక ఉద్యమాలు ఫలితంగా ఏర్పాటైన సంక్షేమ బోర్డును కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు.ప్రజల సంక్షేమం కోసం మాత్రమే సేకరించిన నిధులు దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పన్నుతున్నారని అన్నారు.రెండు సంత్సరాలు గా కార్మికులకు ఇవ్వవలసిన నష్టపరిహారం చెల్లించ కుండా అన్యాయం చేశార ని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం నమోదు చేసుంకున్న కార్మికులకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని అన్నారు.కరోనా,లాక్ డౌన్ కాలం లో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు.ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం బోర్డ్ నుండి తీసుకున్న 830 కోట్ల రూపాయలు తిరిగి జమచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ రామన్న,ఎన్ నాగేశ్వరావు,గోపికృష్ణ,ఈశ్నర్శింగరావు, జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇట్లు నమస్కారములతో డీ అప్పలరాజు.