భారత్‌లో తొలిసారి కనిపించిన అరుదైన పక్షి..ప్రపంచ వ్యాప్తంగా ౩ సార్లు మాత్రమే ఈ పక్షి దర్శనం

భారత్‌లో తొలిసారి కనిపించిన అరుదైన పక్షి..ప్రపంచ వ్యాప్తంగా ౩ సార్లు మాత్రమే ఈ పక్షి దర్శనం
క్యాపిటల్ వాయిస్, స్పెషల్ న్యూస్ :- అత్యంత అరుదైన పక్షి భారత్‌లో తొలిసారి దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షి 3 సార్లు మాత్రమే కనిపించిందట. ఈ పక్షి మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో, రెండవసారి బ్రెజిల్‌లో కనిపించిందట. మూడోసారి భారత దేశంలో దర్శనమిచ్చిన ఈ పక్షి రాజస్థాన్‌లో కనిపించిందట. అత్యంత అరుదైన పక్షి భారత్‌లో తొలిసారి దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షి 3 సార్లు మాత్రమే కనిపించిందట. ఈ పక్షి మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో, రెండవసారి బ్రెజిల్‌లో కనిపించిందట. మూడోసారి భారత దేశంలో దర్శనమిచ్చిన ఈ పక్షి రాజస్థాన్‌లో కనిపించిందట. ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు పక్షి వీక్షకులు భాను ప్రతాప్ సింగ్, విధాన్ ద్వివేది దీనిని చూశారట. అంత అరుదుగా కనిపించే ఆ పక్షి ఏంటో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా కనిపించే ఈ పక్షి పేరు లూసిస్టిక్ కామన్ కింగ్ ఫిషర్. ఈ పక్షి భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఆగస్టు 3న ఉదయం 6 గంటల 19 నిమిషాలకు దంగి గ్రామంలోని రెడ్ సెల్యూట్ ఫామ్‌లో కనిపించిందట. అయితే దాని గూడు గ్రామంలోని చెరువులో ఉన్నట్లు తెలిసిందట. అప్పటినుంచి భాను ప్రతాప్ సింగ్, విధాన ద్వివేది ఈ పక్షి గురించి సమాచారం రాబట్టడం మొదలుపెట్టారు. అలా దాని గూడును కనిపెట్టిన వీరు పక్షి నిపుణులను సంప్రదించి, సమాచారం అందించారు. వారు నిపుణుల సహాయంతో ఒక పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేసి ఇండియన్ బర్డ్ వెబ్‌సైట్‌కు పంపారు. భారతదేశంలో తొలిసారి లూసిస్టిక్ కామన్ కింగ్ ఫిషర్ పక్షిని చూడటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పక్షి ప్రేమికులు