భారత్ కు సాంకేతిక సేవలు అందించే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ప్రభుత్వ సంస్థపై చైనా గ్రూప్ సైబర్ దాడి !

భారత్ కు సాంకేతిక సేవలు అందించే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ప్రభుత్వ సంస్థపై చైనా గ్రూప్ సైబర్ దాడి !
క్యాపిటల్ వాయిస్, అంతర్జాతీయం :- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పబ్లికేషన్స్, థింక్‌ట్యాంక్‌లను లక్ష్యంగా చేసుకుని చైనాకు చెందిన రెడ్ ఆల్ఫా అనే హ్యాకింగ్ గ్రూప్ సైబర్ దాడులకు పాల్పడుతోంది. గతేడాది ఇది 350 డొమైన్లను హ్యాక్ చేసినట్టు ‘రికార్డెడ్ ఫ్యూచర్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ బాధిత దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని తెలిపింది. నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ లక్ష్యంగా దాడులకు పాల్పడిందని పేర్కొంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యధిక ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఎన్‌ఐసీ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ది మెర్కటోర్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ చైనా స్టడీస్, రేడియో ఫ్రీ ఆసియా, ది అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తైవాన్ వంటి సంస్థలపై రెడ్ ఆల్ఫా సైబర్ దాడులకు పాల్పడినట్టు వివరించింది.వ్యూహాత్మక ప్రయోజనాలు లభించే సంస్థలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతోపాటు చైనాలోని ఉయ్‌ఘర్ ముస్లింలు, టిబెట్ మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నాయి. ఇటీవల కాలంలో తైవాన్ రాజకీయ, ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థలపై దాడిచేసి సమాచారం సేకరిస్తున్నట్లు రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది. తైవాన్ రిజిస్టర్ డొమైన్లలో నమోదయ్యే వెబ్‌సైట్లపై ఈ గ్రూపు నిఘా ఉంచిందని వెల్లడించింది.వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక రకమైన పీడీఎఫ్ ఫైల్స్‌ను ఫిషింగ్ సైట్స్ లింకులతో పంపినప్పుడు వీటిని తెరిస్తే ఆయా లాగిన్ క్రెడెన్షియల్స్ రెడ్‌ఆల్ఫా చేతికి వస్తాయి. గత మూడేళ్లుగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఈ సంస్థ వద్ద భారీ ఎత్తున సిబ్బంది వనరులు ఉన్నట్లు రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది. గొ డాడీ ద్వారా డొమైన్‌ల నమోదు, ఫోర్‌విన్ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో హోస్టింగ్ వంటి కార్యకలాపాలను టార్గెట్ చేసిన పాత సంస్థ టీటీపీస్ నుంచి 2019 చివర 2020 ప్రారంభంలో ఇది విడిపోయింది’’ అని పేర్కొంది. అయితే, చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎంఐటీ టెక్నాలజీ రివ్యూలో మాట్లాడుతూ.. తమ దేశం సైబర్ దాడులకు వ్యతిరేకమని, అటువంటి చర్యలను ఎన్నటికీ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.