Uncategorized

బ్యాంకు అదనపు చార్జీలతో సతమవుతున్నారా…అయితే ఇలా చేయండి

బ్యాంకు అదనపు చార్జీలతో సతమవుతున్నారా…అయితే ఇలా చేయండి

డబ్బు పరంగా ఏదో ఒక లావాదేవీకి బ్యాంకులకు సంబంధం ఉంటుంది. అందుకే బ్యాంకులు చాలావాటికి సేవ రసుములు వసూలు చేస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ ఛార్జీలే చెల్లించేందుకు ఆస్కారం ఉంటుంది.దాదాపుగా అందరి ఆర్థిక లావాదేవీలు బ్యాంకులతో ముడిపడ్డాయి. డబ్బు పరంగా ఏదో ఒక లావాదేవీకి బ్యాంకులకు సంబంధం ఉంటుంది. అందుకే బ్యాంకులు చాలావాటికి సేవ రసుములు వసూలు చేస్తాయి. కొన్నిసార్లు ఊహించని మొత్తంలో సేవ రుసుము కట్టాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ ఛార్జీలే చెల్లించేందుకు ఆస్కారం ఉంటుంది.

బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించాలే నెల, మూడు నెలల వారీగా కనీస నగదు నిల్వ చేయాల్సి ఉంటుంది. అందుకే మన అవసరాలను బట్టే ఖాతాలను ఎంచుకోవడం ద్వారా సంబంధిత ఖాతాకు సేవ రుసుము తక్కువ చెల్లించొచ్చు.భవిష్యత్తులో చేపట్టే బ్యాంకు లావాదేవీలకు సేవ రుసుములను మనం అంచనా వేయొచ్చు. అందుకు ‘ప్రొఫార్మా ఇన్వాయిస్‌’ చదవడం అవసరం. సాధారణంగా రుణాల విషయంలో ప్రొఫార్మా ఇన్వాయిస్‌ను ఎక్కువగా అధ్యయనం చేస్తుంటారు.బ్యాంకు వడ్డీరేట్లు, సేవా రుసుములను మనం నెగోషియేట్‌ చేసుకోవచ్చు. ముందుగా రెండు, మూడు బ్యాంకుల వద్ద కొటేషన్స్‌ తీసుకొని మనకు అవసరమైన బ్యాంకులో ఛార్జీలను తగ్గించమని అడగొచ్చు.

ఏదైనా సేవా రుసుము వసూలు చేసేముందు బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా వినియోగదారులకు నోటిఫై చేస్తాయి. అందుకే మీ మొబైల్‌, ఈమెయిల్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తుండాలి. బ్యాంకు సందేశాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. అప్పుడే హఠాత్తుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న భావన ఉండదు. బ్యాంకు స్టేట్‌మెంట్లను నెల, మూడు నెలలకు సరిచూసుకోవాలి. మీరు వినియోగించని వాటికి రుసుములు వసూలు చేస్తుంటే వద్దని చెప్తే ఛార్జీలు పడవు.ఒకవేళ బ్యాంకులు మీ నుంచి అనైతికంగా రుసుములు వసూలు చేస్తే బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడకండి. మరీ ఎక్కువ డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాకపోతే అంబుడ్స్‌మన్‌ వద్దకు పోకపోవడమే మేలని నిపుణులు అంటారు.ప్రస్తుత బ్యాంకు పట్ల విసిగిసోతే మరో బ్యాంకులో ఖాతా తెరిచేందుకు వెనుకాడకండి. బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. మరో బ్యాంకులో ఖాతా తెరిస్తే రుణాలు, వాయిదాలు, బీమా, సిప్స్‌ వంటికి సరిగ్గా లింకయ్యేలా చూసుకోండి. అయితే క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా, రుణ వాయిదాల చెల్లింపుల్లో ఇబ్బంఇ రాకుండా చూసుకోవడం ముఖ్యం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!