బంగాళాఖాతంలో మరో అల్పపీడనం…తెలంగాణ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం…తెలంగాణ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
క్యాపిటల్ వాయిస్, స్పెషల్ న్యూస్ :- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి ఏర్పడబోయే అల్పపీడనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి ఏర్పడబోయే అల్పపీడనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడే ఈ తాజా అల్పపీడనం క్రమంగా ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుందని, ఒడిశా తీరం వైపు కదులుతుందని చెబుతున్నారు. దీని ప్రభావం ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తోన్నారు. ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్రపైనా పడుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.ఈ తాజా అల్పపీడనం వల్ల వచ్చే ఏడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఒకట్రెండు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కావడానికి అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావం ఒడిశాపై అధికంగా ఉంటుందని, తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి 14 లేదా 15వ తేదీల్లో విశాఖపట్నంలో 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం నిపుణులు అంచనా వేస్తోన్నారు.