అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత హైదరాబాద్ లో అరెస్ట్…… సిబిఐ ఆధ్వర్యంలో బెంగళూరు కు తరలింపు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత హైదరాబాద్ లో అరెస్ట్…… సిబిఐ ఆధ్వర్యంలో బెంగళూరు కు తరలింపు
క్యాపిటల్ వాయిస్,అమరావతి :- అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ.42.79 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు. గీతను అరెస్ట్ చేసి బెంగళూరుకు సీబీఐ అధికారులు తరలించారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న డబ్బుని దారి మళ్లించారనే అభియోగాలతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు.