Andhra PradeshPolitics

భారతదేశానికి అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ దాపురించింది : పి సి సి అధ్యక్షులు సాకే శైలజానాథ్

భారతదేశానికి అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ దాపురించింది : పి సి సి అధ్యక్షులు సాకే శైలజానాథ్

క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- ఎ.ఐ.సి.సి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు చేవూరు.దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్ధానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఎ.ఐ.సి.సి అధ్యక్షులు సాకే.శైలజానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఇందిరాభవన్ నుండి ర్యాలీగా బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ.శ్రీ.Y.S.రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సంధర్భంగా స్థానిక గాంధీబొమ్మ కూడలి వద్ద నున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సమీప పెట్రోలు బంకు దగ్గర కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు,డీజలు మరియు వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన ప్రదర్శనలు చేసి తదుపరి ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే.శైలజానాథ్ మాట్లాడుతూ బీజేపీ నరేంద్రమోదీ పరిపాలన వల్ల భారత దేశానికి అచ్చేదిన్ పోయి చచ్చేదిన్ దాపరించాయన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై అధిక మొత్తంలో పన్నుల భారం మోపుతున్నారనటానికి కేంద్ర ఎక్సైజ్ సుంకమే నిదర్శనం అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నందున పేదవాడి మనుగడ కష్టతరమవుతున్నద న్నారు. కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు ఇస్తున్న మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై కనీసం కనికరం కూడా లేకుండా విపరీతమైన పన్నులు విధించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పనులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలపై వ్యాట్ క్రింద ఒక్క లీటరు పెట్రోలు,డీజలుపై రూ.4 మరియు రోడ్డు ట్యాక్స్ క్రింద మరో రూ.1.30 పై దొడ్డిదారిలో పన్నులు వసూలు చేస్తోందన్నారు.గడిచిన రెండు సంవత్సరాలుగా విపరీతంగా పెంచిన పెట్రోలు,డీజల్,వంటగ్యాస్ మరియు వంటనూనె ధరలతో లక్షల కోట్ల రూపాయల పన్నుల భారం ప్రజలపై మోపుతున్న బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ అచ్చేదిన్ అంటే పదే పదే పెట్రోలు,డీజిల్ ధరలను పెంచడమా.సబ్కావికాస్ అంటే వంటగ్యాస్ ధరలతో మహిళల కంట కన్నీరు తెప్పించడమా అని ఎద్దేవా చేశారు..కేంద్ర ప్రభుత్వం పెంచిన సెంట్రల్ ఎక్ససైజ్ సుంకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. కరోన నేపథ్యంలో దేశ ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా లేకుండా అడ్డు అదుపు లేని అధిక పన్నులు వేసి ప్రజలను దోచుకుంటున్నారన్నారు .కాంగ్రెస్ పార్టీ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారేల్ ధర 70 డాలర్లు వున్నప్పుడు దేశంలో ఒక్క లీటరు పెట్రోలు ధర రూ.70, డీజలు ధర రూ.50 ఉన్నాయని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క లీటరు పెట్రోలు,డీజలు ధరలు సెంచరీ మార్కు దాటాయన్నారు..ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కానీ నాటి కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర ఎక్సైజ్ సుంకం మాత్రం ఒక్క లీటరు పెట్రోలుపై రూ.9.48 పై,డీజలుపై రూ.3.56 పై మాత్రమే విధించి ప్రజలపై ఏ మాత్రం భారాన్ని వేయలేదని .కానీ నేడు ప్రస్తుత నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క లీటరు పెట్రోలుపై రూ.33.00 పై,డీజలుపై రూ.31.83 పై కేంద్ర ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తూ దేశ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.బీజేపీ ప్రభుత్వం పెంచిన అధిక ధరల కారణంగా చేతి వృత్తి,చిన్న వ్యాపారులు ఇలా అందరూ చిన్నాభిన్నం అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అన్నీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉడతా.వెంకట్రావు, చింతాల వెంకటరావు, షేక్.ఫయాజ్,దుద్దుకూరి.రమేష్ నాయుడు,పరిమళ.వెంకటేశ్వర్లు,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లేళ్ళపల్లి.సురేష్ బాబు,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తలారి.బాలసుధాకర్,కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరి.శ్రీనువాసులు రెడ్డి,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొండా.అనిల్ కుమార్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పప్పర్తి.గణేష్ బాబు, అధ్యక్షుడు రాజా,మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్.అల్లావుద్దీన్,మహిళా అధ్యక్షురాలు లతారెడ్డి,గీతా రెడ్డి,ఐ.ఎన్.టి.యూ.సి అధ్యక్షుడు షేక్.ఛాన్బాషా, ఎ.ఐ.సి.సి సభ్యులు యుగంధర్,.మోహన్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పుత్తూరు.రాము, షేక్.హుస్సేన్ బాషా,రాజేష్ రెడ్డి,అన్ని మండలాల మండలాధ్యక్షులు గుణపాటి. ప్రతాప్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి,వెంకటయ్య,కిషోర్ బాబు,చంద్రశేఖర్,గురుమూర్తి, శ్రీనివాసాచారి,బ్రహ్మయ్య,కంచి.వెంకటేశ్వర్లు,సర్ఫరాజ్ షబ్బీర్,హాజీ హనీఫ్,అలీమా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!