Andhra PradeshEducation

ఏపీ పదవ తరగతి పరీక్షలో ఇక ఆరు పేపర్లే – సీబీఎస్‌ఈ పరీక్షా విధానం అమలుకు ఉత్తర్వులు !

ఏపీ పదవ తరగతి పరీక్షలో ఇక ఆరు పేపర్లే – సీబీఎస్‌ఈ పరీక్షా విధానం అమలుకు ఉత్తర్వులు !

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీ టెన్త్ పరీక్షల్లో ఇక ఆరు పేపర్లే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చేయనున్నారు.పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తున్నందున 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు పెడతారు కానీ.. నేరుగా సీబీఎస్‌ఈకి సబంధం ఉండదని.. రాష్ట్ర బోర్డే పెడుతుందని భావిస్తున్నారు.పదో తరగతి.. భవిష్యత్తు అవకాశాలకు అత్యంత కీలకమైన దశ! ఉన్నత విద్యలో ఏ కోర్సులో అడుగు పెట్టాలనే స్పష్టతకు సాధనం.. పదో తరగతి మార్కులు!! అంతేకాదు ఈ తరగతిలో చూపిన ప్రతిభ, వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అందుకే కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.   వాస్తవానికి పదో తరగతి పరీక్షల్లో హిందీ మినహా మిగతా సబ్జెక్ట్‌లలో (తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌) ..ప్రతి సబ్జెక్ట్‌లోనూ పేపర్‌–1,పేపర్‌–2 ఉంటాయి. అలా మొత్తం పదకొండు పేపర్లలో పరీక్షలు జరిగేవి. కానీ.. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో గత పరీక్షలను ఏడు పేపర్లతోనే నిర్వహించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పది, ఇంటర్‌ పూర్తి చేస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తాచాటే అవకాశం దక్కుతుంది. ఈ విధానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండగా… ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలుచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సిలబస్‌ వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు.  అలాగే సీబీఎస్‌ఈ  పరీక్షల  విధానంలో కూడా మార్పులు కనపడుతున్నాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆరో తరగతి నుంచే జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థి అభ్యసనా సామ ర్థ్యాలు పెంచేలా సిలబస్‌ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు, కంప్యూటర్, సైన్స్‌ ల్యాబ్‌లు, ఆటస్థలం ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా బోధన సిలబస్‌లో ఇమిడి ఉంటుంది. ఐఐటీ, ఎయిమ్స్‌ వంటి కేంద్రీకృత సంస్థ నుంచి భవిష్యత్‌ అధ్యయనాలను కొనసాగించాలను కుంటే సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు చాలా సహాయ పడతాయి. ఈ సంస్థల ప్రాథమిక పరీక్షలు సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహిస్తారు. అందుకే సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!