ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోణిజేటి రోశయ్య సంస్మరణ సభ.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోణిజేటి రోశయ్య సంస్మరణ సభ.
క్యాపిటల్ వాయిస్ : అక్కయ్యపాలెం ప్రతినిధి.
విశాఖ వుడా చిల్డ్రన్ ఎరీనా నందు పైడా కృష్ణ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వర్గీయ శ్రీ కొణిజేటి రోశయ్య సంస్మరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విద్యావేత్త, మేధావి, రాజనీతిజ్ఞులు, అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఒదిగి ఉన్న ఆదర్శవాది, ఎన్ని పదవులు అధిరోహించినా అహంకారం లేని నిగర్వి, ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులును సైతం తన వాక్చాతుర్యంతో శభాష్ అనిపించుకున్న అపర చాణిక్యులు, రాజకీయనాయకునికి పర్యాయపదంగా సూచింపబడిన మర్యాదస్తులు, నిగర్వి, స్నేహశీలి ,తెలుగు రాష్ట్రాలకు ఆణిముత్యం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టిన మహా నాయకుడు రోశయ్య అని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈసందర్భంగా కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..