ఆంధ్రప్రదేశ్ లోరౌడీ పాలన నడుస్తోందా….. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా ?

ఆంధ్రప్రదేశ్ లో రౌడీ పాలన నడుస్తోందా… రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా ?
- టీడీపీ నాయకులు అరెస్టులు, వైస్సార్సీపీ నాయకులు నిరసనలు.
- ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కనిపించటలేదా, ఇదేనా ప్రాజాస్వామ్యం.
- రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించాలి.
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- ️ మంగళవారం జరిగిన దాడులు రౌడీ రాజ్యం అనటానికి నిదర్శనం.టడిపి శ్రేణులుపై వైసీపీ జరిపిన దాడిని ఖండిస్తూ ఈరోజు తలపెట్టిన బంద్ను నిర్వీర్యం చేయటానికి ఈ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది, అందులో భాగంగా ఈరోజు తెల్లవారు జామున భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు, గంటా నూకరాజు, పాశర్ల ప్రసాద్, 5వ వార్డు మొల్లి లక్ష్మణరావు,నాగోతి సత్యనారాయణ , 6 వ వార్డు దాసరి శ్రీనివాస రావు, గొల్లంగి ఆనంద్ బాబు ,7వ వార్డు పిళ్లా వెంకటరావు ని పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. బుధవారం నారా లోకేష్ పర్యటన విశాఖపట్నం అన్ని జోన్ ల లో భారీ జన సమీకరణ లోకేష్ విశాఖ లో పర్యటిస్తే పర్యటన విజయవంతం ఐతే టీడీపీ బలం పెరుగుతుంది అనే భయం తోనే పర్యటన రద్దు చేయించాలానే ముఖ్య ఉద్దేశ్యం తోనే దాడులు చేయించారని, టీడీపీ పార్టీ నాయకులు పట్టాభి విలేకరుల సమావేశం సంభాషణలు బూచి గా చూపించి ఆయన ఇంటిపైన మంగళగిరి ప్రధాన పార్టీ కార్యాలయం పైన దాడులు చేసి ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. బుధవారం రాష్ట్రావ్యాప్తంగా టీడీపీ బంధుకు పిలుపునివ్వటం తో బందుకూడా చేయనివ్వకుండా ముందస్తుచర్యల్లో విశాఖ జిల్లా మొత్తం టీడీపీ నాయకులను భారీగా అర్థరాత్రి అరెస్టులు చెయ్యటం పోలీసులు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను మరచి ప్రభుత్వం చేస్తున్న రౌడీయిజాన్ని అడ్డుకోవటం మాని టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టులు చెయ్యటం పై పోలీసులు ప్రభుత్వం కాళ్ళదగ్గర దేహీ అయ్యారని సీఎం డౌన్ డౌన్ అంటూ ఎక్కడికక్కడ రోడ్లపై నినాదాలు చేసారు. మంగళవారం జరిగిన టీడీపీ నాయకుల ఇంటిపైన టీడీపీ కార్యాలయాలపైన దాడులు పోలీసు వారికి కనపడలేదా విశాఖ పార్టీ కార్యాలయంలోకి వైస్సార్సీపీ మహిళలు చొచ్చుకు వెళ్లి రామారావు విగ్రహం దగ్గర తిట్టటం ఎంతవరకు సమంజసం అని విమర్శిస్తున్నారు.