ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా అంకంరెడ్డి నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా అంకంరెడ్డి నారాయణమూర్తి
క్యాపిటల్ వాయిస్, విజయవాడ :- రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్, నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నియమితులయ్యారు. గురువారం సాయంత్రం కృష్ణ వారిది సమీపంలోని బెజవాడ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పవరపు సాంబశివ నాయుడు గౌరవ అధ్యక్ష నియామక పత్రాన్ని అంకంరెడ్డి నారాయణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాంబశివ నాయుడు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి నారాయణ మూర్తి మన యూనియన్ గౌర అధ్యక్షునిగా ఉండడం చాలా సంతోషకరమని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర ప్రభుత్వ, గ్రీవిన్స్ సెల్ చైర్మన్, నవరత్నాల ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. పూల దండ వేసి దుశ్శాలువాతో చిరు సత్కారం చేశారు. అంకం రెడ్డి నారాయణ మూర్తి రాకతో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ కు మరింత బలం చేకూరిందని అన్నారు. జర్నలిస్టు, ఎడిటర్స్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న సంఘం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ అని సాంబశివ నాయుడు అన్నారు.గౌరవ అధ్యక్షులు నారాయణమూర్తి మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, యూనియన్ లోని సభ్యులందరికీ అన్ని వేళల అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంకే శ్రీనివాస్ సురుచి వారి తాపేశ్వరం కాజాలను అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో మొదలియర్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, డి.ఎస్.పి రమేష్ బాబు, యూనియన్ ప్రధాన న్యాయ సలహాదారులు నరహరిశెట్టి శ్రీహరి, సీనియర్ జర్నలిస్టు కె.బి.జి.తిలక్, అరుణోదయ ప్రింటర్స్ అధినేత రాజశేఖర్, జె.పి. రెడ్డి, కోటేశ్వరరావు హాజరై నారాయణమూర్తికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సాయికుమార్, కార్యదర్శి ఆదినారాయణమూర్తి, కోశాధికారి కోటేశ్వరరావు, అమరావతి అధ్యక్షులు ఉమాయాన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంకే శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళీకృష్ణ తదితరులు యూనియన్ తరపున హాజరై శుభాకాంక్షలు తెలిపారు.