Andhra PradeshVijayanagaram
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం.

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) విజయనగరం ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లి”, విజయనగరం జిల్లా సర్వ సభ్య సమావేశం.
ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాలు, లీలామహల్ వద్ద విజయనగరం నందు
జరిగింది, ముఖ్య అతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ.సితంరాజు
సుధాకర్ పాల్గొన్నారు, కో-అపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈఓ శ్రీ జి నాగసాయి
పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ అభివృద్ధి, భవిష్యత్ కార్యచరణపై
చర్చించడం, గవర్నింగ్ బాడీ సభ్యుల ఎన్నిక జరిగింది. సంఘ సభ్యులు అందరూ ఈ
సమావేశం లో పాల్గొన్నారు. సమావేశానికి సభ్యులు క్రెడిట్ సొసైటీ సభ్యత్వ
కార్డ్ ను విధిగా తీసుకురావాలని, కొవిడ్ నియమ నిబంధనలకు లోబడి సమావేశం
నిర్వహణ జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర బ్రాహ్మణ
కార్పొరేషన్ డైరెక్టర్ డబ్ల్యు.ఎల్.ఎన్.రాయలు కూడా పాల్గున్నారు.