Andhra PradeshVisakhapatnam
ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి కలకలం

*ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి కలకలం*
*సెక్యూరిటీ గార్డులే గంజాయి విక్రేతలు!*
*నలుగురి అరెస్ట్.. ఒకరి పరారీ రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు*
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం :- విశాఖలో ఉన్నత విద్యలకు నిలయమైన ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి కలకలం రేగింది. వర్సిటీ సెక్యూరిటీ గార్డులే గంజాయి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో పోలీసులు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఏయూ భద్రతా అధికారి కారు డ్రైవర్ సూత్రధారి అని భావిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. విశాఖ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.