ఆంద్రాయూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి : ఎం.వి.ప్రణవ్ గోపాల్.

ఆంద్రాయూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి : ఎం.వి.ప్రణవ్ గోపాల్.
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం జిల్లా ప్రతినిధి :- ఆంద్రాయూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని, ఆంద్రాయూనివర్శిటీయా?లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకుంటూ అక్కడ రాజకీయాలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎపి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ విమర్శించారు.రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యం ఉంటే ఉపకులపతి పదవికి రాజీనామా చేయాలని,ఆంద్రాయూనివర్శిటీ పేరు ప్రఖ్యాతులు నాశనం చేయవద్దని,కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న ఆచార్య ప్రసాద్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని అయన డిమాండ్ చేసారు.జివిఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో రెడ్డి కుల సమావేశంలో పాల్గొని ఆచార్య ప్రసాద్ రెడ్డి ఆంద్రాయూనివర్శిటీ పరువు తీశారని,ఆంద్రాయూనివర్శిటీ లో కోవిడ్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించడంపై విలువలు కలిగిన మేమైతే రాజీనామా చేసేవారిమి అంటున్న మాజీ ఉపకులపతులు, అయినా చలనంలేకుండా రాజకీయాలు చేస్తున్న ఆచార్య ప్రసాద్ రెడ్డి అంటూ అయన ఘాటుగా విమర్శించారు.ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897,డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ,కోవిడ్ నిబంధనలు అమలులో ఉండగా పార్టీ కార్యక్రమాలు ,జన్మదిన వేడుకలతో కోవిడ్ వ్యాప్తికి కారణమవుతారా అని ప్రశ్నించారు.దళిత ఉపకులపతులపై విచారణ కమిటీలు రెడ్డి ఉపకులపతులైతే అందలాల అని ప్రశ్నిస్తూ ఆచార్య ప్రసాద్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోని భర్తరఫ్ చేయాలని అయన డిమాండ్ చేసారు.మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి యువజన జెఎసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ ,విశాఖ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు యస్.రతన్ కాంత్,ప్రధాన కార్యదర్శి జోష్ యాదవ్,గాజువాక అసెంబ్లీ అధ్యక్షుడు రవి కుమార్,యస్.కోట అసెంబ్లీ అధ్యక్షుడు ఈశ్వర్ , విశాఖ పశ్చిమ అధ్యక్షుడు వినయ్ తదితరులు పాల్గొన్నారు.