అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే…..2024లో బీజేపీ-జనసేన కూటమికే అధికారం – విష్ణువర్ధన్ రెడ్డి

అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే…..2024లో బీజేపీ-జనసేన కూటమికే అధికారం – విష్ణువర్ధన్ రెడ్డి
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక శుభ పరిణామానికి నాంది అన్నారు. 2024లో బీజేపీ-జనసేన కూటమికే అధికారం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు సభ కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కలిశారు. నోవాటెల్ హోటల్ లో ఇద్దరూ కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించుకున్నారు,ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఉందా.. ఇప్పుడీ ప్రశ్నలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు ఇస్తున్నారు.అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అమిత్ షా, ఎన్టీఆర్ ల భేటీని ఏపీ బీజేపీ స్వాగతిస్తోందన్నారాయన. జనసేన అధినేత పవన్, జూనియర్ ఎన్టీఆర్ లకు బీజేపీలో సముచిత స్థానం ఇస్తామన్నారు.అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక శుభ పరిణామానికి నాంది. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ డైనమిక్ లీడర్. ప్రముఖమైనటు వంటి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజకీయ అవగాహన కలిగినటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్, దేశ రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందిన హోంమంత్రి అమిత్ షా కలయికను ఏపీ బీజేపీ స్వాగతిస్తోంది.కచ్చితంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పెను సంచలనమే. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఎన్నో ఏళ్లుగా బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ మద్దతు ఇస్తున్నారు. షా, ఎన్టీఆర్ కలయికను తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతమైన అంశంగా, సానుకూల అంశంగా బీజేపీ భావిస్తోంది. 2009 ఎన్నికల్లో నాటి పరిస్థితులకు అనుగుణంగా ఓ క్రియాశీలక పార్టీకి ఎన్టీఆర్ పని చేసినటువంటి తీరు కానీ, ఎన్నికలు జరుగుతున్న సందర్భం లోనే ఆయనొక ప్రమాదానికి గురి కావడం, తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ప్రచారం చేయడం జరిగింది.ముఖ్యమంత్రిగా పని చేసిన కుటుంబం నుంచి వచ్చారు ఎన్టీఆర్. ఆయనకు రాజకీయ, సినీ నేపథ్యాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితమైన రాజకీయ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీఆర్, అమిత్ షా కలయిక కచ్చితంగా శుభసూచికమే. దక్షిణాది రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, తమిళనాడు లలో ఒక్కో దగ్గర ఒక్కో రకమైన రాజకీయ వ్యూహాన్ని బీజేపీ అవలంభిస్తోంది. కుటుంబ వారసత్వ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో లిమిటెడ్ కంపెనీల్లా తయారయ్యాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్, కర్నాటకలో దేవెగౌడ.. ఇవన్నీ గమనించినప్పుడు వారసత్వ రాజకీయాలు కాకుండా జవసత్వ రాజకీయాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుంది.భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. ఏపీ, తెలంగాణలో ఇదొక రాజకీయ ప్రకంపన. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం.. ఏపీలో టీడీపీ, వైసీపీకి అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రావాలని, గ్రూప్ రావాలని పవన్ చెప్పారు. ఆ గ్రూప్ లో ఆల్రెడీ ముందువరుసలో బీజేపీ, జనసేన ఉన్నాయి. ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా 2024లో బీజేపీ-జనసేన ప్రభుత్వం రావాలి. అందుకు మా దగ్గర కొన్ని వ్యూహాలు ఉన్నాయి. పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మా దగ్గర కొన్ని వ్యూహాలు ఉన్నాయన్నారు. ఈ వ్యూహాలతో అధికారంలోకి రావాలన్నది మా ఉమ్మడి లక్ష్యం అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.