మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గా ఆళ్ళ నియామకం

మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గా ఆళ్ళ నియామకం.
క్యాపిటల్ వాయిస్, కృష్ణాజిల్లా ప్రతినిధి :- కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కమిటీఅధికార ప్రతినిధి గా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ రావు నియమితులయ్యారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి మెయిన్ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చన నాయుడు ప్రకటించారు.
గన్నవరం నియోజవర్గం బాపులపాడు మండలం రంగన్న గూడెం కు చెందిన ఆళ్ళ వెంకటగోపాలకృష్ణ రావు ఇంజనీరింగ్ పట్టభద్రుడు ,నీటిపారుదల రంగ నిపుణులు. రంగన్న గూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా1989లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు గా మూడు సార్లు సేవలందించి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీలో సంయుక్త కార్యదర్శిగా, కార్యనిర్వహక కార్యదర్శి గా, ఉపాధ్యక్షులుగా, అధికార ప్రతినిధిగా, వివిధ హోదాల్లో పని చేశారు.1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థ ల యాజమాన్య చట్టం ద్వారా రంగన్న గూడెం నీటి సంఘం అధ్యక్షులుగా బాపులపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికై 1997 నుంచి 2014వరకు కాంగ్రెస్,తెలుగుదేశం,ప్రభుత్వాలలో రైతులకు సేవలు అందించడం విశేషం.
2015లో బాపులపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికై అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆశీస్సులతో జలవనరుల శాఖ రాష్ట్ర ఏపెక్స్ కమిటీ సభ్యునిగా ఎన్నికై నీరు ప్రగతి కార్యక్రమంలో నవ్యాంధ్ర లోని 13 జిల్లాలో పర్యటించి రైతులకు సేవలను అందించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు.1998,2009,2016లో 3 సార్లు ఉత్తమ పనితీరుకు గాను జిల్లా స్థాయిలో ఉత్తమ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా అవార్డు తీసుకున్నారు.1999లో 2017లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరుకు బెస్ట్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అవార్డు పొందారు 2016లో శ్రీశైలం ఏగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ ప్రాజక్టులు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో ఆంధ్ర రైతుల తరపున తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి కేంద్ర ప్రభుత్వం 2016 సెప్టెంబర్ లో మొదటి ఏపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణభూతులు అయ్యారు. ప్రస్తుతం నవ్యాంధ్ర లోని13జిల్లాలో ఉన్న నీటి సంఘాల ప్రతినిధులుతో ఏర్పడిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గా పనిచేస్తు రైతులుకు విశేష సేవలు అందిస్తున్నారు .
మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధిగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణ రావు నియామకం పట్ల మండల తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు దయాల రాజేశ్వరావు ,ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ ,రంగన్న గూడెం సర్పంచ్ కసుకుర్తి రంగామణి, పాల కేంద్రం అధ్యక్షులు మొవ్వ శ్రీనివాస రావు మాజీ సర్పంచ్ మైనేని గోపాలరావు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి పుసులూరి లక్ష్మీనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.తనను అధికార ప్రతినిధిగా నియమించడానికి సహకరించిన గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కి మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ రావుకి “ఆళ్ళ” కృతజ్ఞతలు తెలియజేశారు…