Andhra Pradeshkrishna
ఆకాశంలో సగం అయినా నిర్ణయాధికారంలో మాత్రం దూరం…మహిళా రిజర్వేషన్ల పోరాటానికి పాతికేళ్లు

ఆకాశంలో సగం అయినా నిర్ణయాధికారంలో మాత్రం దూరం…మహిళా రిజర్వేషన్ల పోరాటానికి పాతికేళ్లు
క్యాపిటల్ వాయిస్, కృష్ణా జిల్లా ప్రతినిధి :- మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం జరుగుతున్న పోరాటం సెప్టెంబర్ 12 నాటికి 25 యేండ్లు గడుస్తున్నప్పటికి చట్టానికి మోక్షంలేని తీరుపై జాతీయ స్థాయిలో మహిళా సమాఖ్య, సీపీఐ ప్రజా సంఘాల పిలుపు మేరకు ఆంధ్ర్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర సమితి అధ్వర్యంలో శనివారం ఉదయం స్తానిక ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణిస్తూ ఆకాశంలోకి సగంగా చెపుతున్న మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోయిందని నిర్ణయాధికారం చేసే చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం విషయంలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం గత 25 యేళ్ళుగా పోరాటం చేస్తున్నా నేటికీ చట్టరూపంలో లేకపోవడం అన్యాయం అని దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు ,రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 యేళ్లు గడిచినా మహిళా చట్టాలు అమలు కాకుండా రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నారని, 1996 లో ఆనాటి కాంగ్రెస్ పాలన రోజుల్లో లోక్ సభలో సీపీఐ పక్ష నాయకులు గీతాముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ప్రకారం మహిళలకు రిజర్వేషన్ బిల్లు చాలా కాలం తర్వాత రాజ్యసభలో ఆమోదం పొంది ఆగిపోయిందని అవేదన వ్యక్తం చేశారు.మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడిముక్కల రాణి మాట్లాడుతూ మహిళలు ఇళ్లలోనే ఉండాలని కొందరు ఎంపి, ఎమ్మేల్యేలు అవమానకారంగా అన్నారని గుర్తు చేశారు. వెంకయ్య నాయుడు కూడా భాజపా అధికారంలో వస్తె చట్టం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అయినా చట్టం చేయాలని డిమాండ్ చేశారు.మాజీ కార్పొరేటర్ బుట్టి రాయప్ప మాట్లాడుతూ కమ్యూనిస్టు దేశాల్లో చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం కల్పించిన వివరాలు వెల్లడించారు.ప్రజా నాట్యమండలి నగర కార్యదర్శి ఎస్ కే నజీర్ మహిళా సమస్యలు చట్టాల పై చక్కటి గీతాలు ఆలపించారు.కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నగర అధ్యక్షులు మూలి సాంబశివరావు, కట్టేవరపు విజయ రావు, అరసం నాయకులు మోతుకూరి అరుణ కుమార్ మహిళా సమాఖ్య నగర జిల్లా నాయకులు డి. సీతారావమ్మ, అర్ అనసూయ, లంక నాగమణి, దుర్గాసి రమణమ్మ, డి. పుష్పవతి, తవుడమ్మ,ఎన్ భాగ్యలక్ష్మి, కే పద్మావతి సూరమ్మ, ఎస్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.