అధ్యాపకా మీకు ఇది తగునా – ఆగ్రహం వస్తే విద్యార్ధిని కాలితో తంతారా ?

అధ్యాపకా మీకు ఇది తగునా – ఆగ్రహం వస్తే విద్యార్ధిని కాలితో తంతారా ?
క్యాపిటల్ వాయిస్, విజయవాడ :- ఓ అధ్యాపకుడికి కోపం వచ్చింది. ఇక అంతే ఓ విద్యార్ధిని చెంప దెబ్బ కొట్టిందే కాక ఊగిపోతూ ఆ విద్యార్ధిని ఏకం కాలితో ఒకటికి రెండు సార్లు లాగించి తన్నాడు. ఈ సంఘటన విద్యార్ధుల తాలితండ్రులను, ప్రజలను దిగ్బ్రాంతి కలిగించింది. ఈ సంఘటన విజయవాడలోని ఓ కార్పోరేట్ కళాశాలలో జరిగినట్లుగా సామజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.లక్షల్లో ఫీజులు విద్యార్థులకు బాదుడులా కార్పొరేట్ కళాశాలలు మారిపోతున్నాయి అధ్యాపకులమని మరచి విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాల్సింది పోయి పాసవికంగా మారి చివరకు కాళ్లతో సైతం విద్యార్థులను తన్నడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కళాశాలలో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో వీక్షించిన ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. లక్షల్లో ఫీజులు డొనేషన్లు చెల్లించుకుంటూ మా పిల్లలను ఈ విధంగా తంతారా మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అంటూ ప్రతి తల్లి తండ్రి ఉపాధ్యాయుల తీరును మరోవైపు ఇలాంటి సంఘటనలో అవమానకరంగా భావించిన విద్యార్థుల మనోభావాలకు దెబ్బతింటే వారు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధన చేసి, వారిని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవలసిన కళాశాలలే ఇలాంటి సంఘటనలతో విద్యార్థుల జీవితాలను కాలరాస్తున్నాయా అంటూ విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో విద్యతోపాటు నైతిక అభివృద్ధిని పెంపొందించినప్పుడు మాత్రమే ఒక మంచి సమాజాన్ని సృష్టించిన వారమవుతామని అది మరిచి అధ్యాపకులు తమ వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక విద్యార్థులపై ప్రతాపాన్ని చూపటం ఎంతవరకు సమంజసం అని సామాజికవేత్తలు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించి తగు చర్యలు తీసుకోవాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కర్కశంగా దాడి చేసిన ఉపాధ్యాయునిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.