ఏసీబీ వలలో అవినీతి తిమింగలం… లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రంప యెర్రంపాలెం సెక్రెటరీ హనుమంతరావు

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం… లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రంప యెర్రపాలెం సెక్రెటరీ హనుమంతరావు
క్యాపిటల్ వాయిస్, (తూర్పుగోదావరి) గోకవరం :- మండలంలోని రంపయెర్రంపాలెం పంచాయతీ సెక్రెటరీ హనుమంతరావు శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రంపయెర్రంపాలెం గ్రామానికి చెందిన ఎన్. మురళి కృష్ణ ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనుల్లో భాగంగా నిర్మించిన సిసి రోడ్డు పెండింగ్ బిల్లులు మంజూరు కోసం పంచాయతీ సెక్రటరీ 21,000 లంచం అడగడంతో రాజమండ్రి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారని, దీనిపై నిఘా ఉంచి శుక్రవారం మధ్యాహ్నం రంపయెర్రంపాలెం పంచాయతీ కార్యాలయంలో సెక్రెటరీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, డిప్యూటీ సూపరిండెంట్ పి రామచంద్ర రావు, ఇన్స్పెక్టర్లు వి. పుల్లారావు, డి వాసు కృష్ణ, బి శ్రీనివాస రావు, వై సతీష్, ఎస్ విల్సన్ బాబు పాల్గొన్నారు.