5 వ వార్డు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన :కార్పొరేటర్ మొల్లి హేమలత.

5 వ వార్డు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన :కార్పొరేటర్ మొల్లి హేమలత.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
మధురవాడ 5 వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది వార్డు పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీ కోలనీలో రోడ్లు,సీసి రోడ్లు,డ్రైనెజ్ లు త్రాగినీరు,విద్యుత్,శుబ్రత పరిశుభ్రత, సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గతంలో నేను ఎం.యల్.ఏ గా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గురువారం సుమారుగా 5 వార్డు నందు సుమారు ఒక కోటి రూపాయలతో పనులు దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు పరిష్కారం అవుతున్నందుకు మంత్రికి వార్డు కార్పోరెటర్, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ నేను కార్పొరేటర్గా గెలిచిన తరువాత మొదటిసారి చాలా ఆనందంగా ఉందని నా వార్డు సమస్యల పరిష్కారానికి గురువారం శంకుస్థాపన చేయటం వల్ల సంతృప్తి పొందానని ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ, ఇంకా వార్డు లో సమస్యలు ఉన్నాయని వాటిపై అధికారులదృష్టికి తీసుకువెళ్తానని సభాముఖంగా తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.బుధవారం జరిగిన కాఫీ విత్ కార్పోరేటర్ కార్యక్రమం లో జీవియంసి కమిషనర్ కి మేయర్ కి వార్డులో ఉన్న సమస్యలు ను క్షుణ్ణంగా ప్రస్తావించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి,జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాముతో పాటు జీవియంసి యంత్రాంగం కార్పోరేటర్లు వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.