5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆదేశాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మొల్లి లక్ష్మణరావు.

5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆదేశాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మొల్లి లక్ష్మణరావు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన, సకాలంలో స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ హేమలత
జోన్ 2 మధురవాడ:గులాబ్ తుఫాన్ నేపథ్యం లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత సూచించారు. ఆమె ఆదేశాలతో వారి తండ్రిగారైన మొల్లి లక్ష్మణరావు 5వ వార్డ్ పరిధిలో లో గల కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారిలో ధైర్యం నింపి అధికారులను అప్రమత్తం చేశారు, వైయస్సార్ కాలనీలో అతి భారీ వర్షాల కారణంగా విద్యుత్ ట్రాన్స్ ఫారం పేలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకొని హుటాహుటిన మొల్లి లక్ష్మణరావు సంఘటన స్థలానికి వచ్చి,తక్షణమే ఏపిడిసిఎల్ అధికారులను సమాచారం ఇచ్చి, దగ్గర ఉండి మరమ్మతులు చేయించి ప్రజలకు విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు,కార్పొరేటర్ తండ్రిగారైన లక్ష్మణరావు కు,విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాలనీ బ్లాకులలో ఇల్లు పైకప్పులు పెచ్చులు రాలి ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలియపరిచారు, ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలత ద్వారా పై అధికారులకు తెలియపరచి త్వరలోనే సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.