Andhra PradeshVisakhapatnam
5వార్డ్ కార్పొరేటర్ కార్యాలయం,7 వ వార్డు మితిలాపురి ఉడాకాలనీ లో ఘనంగా మహాత్ముని జయంతి ఉత్సవాలు.

5వార్డ్ కార్పొరేటర్ కార్యాలయం,7 వ వార్డు మితిలాపురి ఉడాకాలనీ లో ఘనంగా మహాత్ముని జయంతి ఉత్సవాలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ:మహాత్మా గాంధీ సత్యం,న్యాయం పట్ల విశ్వాసంతో యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారని టిడిపి జిల్లా కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ152వ జయంతి సందర్భంగా శనివారం మధురవాడ బొట్టవానిపాలెం లో గల 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత కార్యాలయంలో మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.7 వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ మితిలాపురి ఉడాకాలనీ లో గల గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈసందర్భంగా మొల్లిలక్ష్మణరావు మాట్లాడుతూ అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీ చేసిన కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు.కులవ్యవస్థ, అంటరానితనం నిర్మూలన, సమానత్వం,సామాజిక న్యాయం వంటి విషయాలలో అలుపెరగని పోరాటం చేసారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 5వ వార్డు నమ్మి శ్రీను, జోగేశ్వరపాత్రో,నమ్మి రమణ, అప్పలస్వామి, దాసరి గోవింద్ నరేంద్ర,ఈయ్యపునాయుడు, లచ్చిబాబు,కనకరాజు 7వ వార్డు పిల్లా వెంకటరావు, పిల్లా నరసింగరావు, పోతిన సోంపాత్రుడు, కానూరి అచ్చుతరావు, నాగోతి సూర్య ప్రకాష్, పోతిన బాలాజీ, పీస చిన్నారావు, పోతిన నాయుడు, మండ రమేష్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

