Andhra PradeshVisakhapatnam
3వ రోజు తుఫాన్ బాధితులకు అండగా కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు.

3వ రోజు తుఫాన్ బాధితులకు అండగా కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ పార్లమెంటు జిల్లా భాజపా నేత 48 వ వార్డు కార్పొరేటర్ జివిఎంసి ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు 3వ రోజు గులాబ్ తుఫాన్ బాధితులకు అండగా నిలుస్తూ ఇంద్ర నగర్ 3, జై భారత్ నగర్ మొదలగు గ్రామాలలో పర్యటించి తీవ్ర తుఫానుకు కొండచరియలు విరిగి పడిన ఇంటి గోడలు కూలిపోయిన వారి వద్దకు వర్షంతోనే వెళ్లి వారికి అండగా నిలుస్తూ కరెంటు సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తూ పలు సహాయక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.గంకల అప్పారావు మాట్లాడుతూ 48 వ వార్డు కొండవాలు ప్రాంతంలో గులాబ్ తుఫాన్ తీవ్రతకు అనేకచోట్ల కొండచరియలు జారిపడి నివాసాలపై పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కొండవాలు ప్రాంతాలని ప్రత్యేకంగా గుర్తించి కొండ చరియలు విరిగి పడకుండా ప్రహరీ గోడలను నిర్మించాలని కోరుతూ సంబందిత అధికారులతో మాట్లాడడం జరిగిందని ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దని తెలియజేయడం జరిగింది.
