2000 రూపాయల నోట్లు రద్దు …….రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన
2000 రూపాయల నోట్లు రద్దు …….రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- రూ.2000 నోట్ల పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటి నుంచే రూ.2 వేల నోట్లను ఇవ్వడం ఆపేయాలని దేశం లోని బ్యాంకులకు సూచనలు చేసింది. అయితే, ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసి వాటికి సమానమైన విలువ కలిగిన ఇతర నోట్లను తీసుకోవచ్చని తెలిపింది. మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు. అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు ఎలాంటి
నిబంధనలు, ఆంక్షలు లేవు. అయితే, బ్యాంక్ సేవలకు అంతరాయం కలగకుండా ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే ఈ పెద్ద నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.
2018లోనే ప్రింటింగ్ నిలిపివేత..
రూ.2000 నోట్లను ఆర్‌బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం నవంబర్, 2016లో చలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశీయ కరెన్సీ అవసరాలను తీర్చేందుకు ఈ పెద్ద నోటను అందుబాటులోకి తీసుకొచ్చంది. రిజర్వ్ బ్యాంక్. అయితే, ఇతర కొత్త నోట్లు సరిపడా అందుబాటులోకి వచ్చిన క్రమంలో రూ.2000 నోట్ల ముద్రణను 2018-19లో నిలిపివేసింది. మార్చి 2017 నాటికి 89 శాతం నోట్లను జారీ చేశారు. మార్చి 31, 2028 నాటికి చలామణిలో గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్లు (37.3శాతం) రెండు వేల నోట్లు ఉండగా మార్చి 31, 2023 నాటికి అది సర్క్యూలేషన్‌లో 10.8 శాతానికి పడిపోయింది. గతంలోనూ 2013-2014 సమయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పలు నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. .