Andhra PradeshVisakhapatnam
హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చాతుర్మాస్య దీక్ష ముగించుకుని విశాఖకు చేరుకున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని ఆశ్రమంలో మంత్రి కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈసంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగు నెలలు కఠోర దీక్షలు అనంతరం స్వామీజీ విశాఖ చేరుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండటం స్వామీజీ గొప్పదనమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులతో సైతం నరసింహ మాలలు వేయించి వారిలో భక్తి భావం పెంపొందించారని మంత్రి కొనియాడారు. స్వామీజీ ప్రార్థనలు, ఆశీస్సులు సీఎం జగన్ పై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే మంత్రి అభిలషించారు. విశాఖ చేరుకున్న స్వామీజీకి ఎయిర్‌పోర్టులో భక్తులు ఘనస్వాగతం పలికారు.
