Andhra PradeshVisakhapatnam
హిందీ పరీక్షల సర్టిఫికెట్లు, మార్కుల జాబితా పంపిణీ.

హిందీ పరీక్షల సర్టిఫికెట్లు, మార్కుల జాబితా పంపిణీ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ఆదర్శ హిందీ ప్రేమీ మండలి భీమునిపట్నం శాఖ మరియు దక్షిణ భారత హిందీ ప్రచార సభ చెన్నై ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రకాల హిందీ పరీక్షల సర్టిఫికెట్లు, మార్కుల జాబితా పంపిణీ. ఆదర్శ హిందీ ప్రేమీ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడయిన కాళ్ళ సూర్యరామకృష్ణారావు అధ్యక్షతన ఈనాటి హిందీ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టమైనది. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిధిగా మాన్సాస్ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం డైరెక్టర్ గారయిన ప్రొఫెసర్ G.L.N రాజు విచ్చేశారు మరియు విశిష్ట అతిధిగా ఆదర్శ హిందీ ప్రేమీ మండలి గౌరవఅధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విచ్చేశారు. వీరు ఉభయలు గాంధీజి మరియు శాస్త్రీజీ చిత్రపఠాలకు పూల మాల వేసి విధ్యార్థినీ , విధ్యార్థులు , కొంత మంది తల్లిదండ్రులుతో సహా ఘనంగా నివాళులు అర్పించడమైనది. వీరు ఉభయలు గాంధీజీ జీవిత విశేషాలను మరియు శాస్త్రీజీ జీవితం లోని కొన్ని ముఖ్య ఘట్టాలను విధ్యార్థినీ, విధ్యార్థులకు వివరించి వీరి ఆదర్షాలను నేటి యువతకు ఆదర్శనీయము,ఆచరణీ యము అని పేర్కొన్నారు. మరియు కాళ్ళ సూర్యరామకృష్ణారావు, సభ అధ్యక్షులు ప్రసంగిస్తూ శ్రీ మహాత్మా గాంధీజీ వారు 1918 వ సంవత్సరంలో ఆదర్శ హిందీ ప్రచార సభను స్థాపించినారు అని, విధ్యార్థినీ, విధ్యార్థులు హిందీ బాషాను నేర్చుకొని దేశ సమైక్యకు తొర్పడాలి అని తెలియజేసినారు.తదనంతము రాష్ట్ర భాషా ప్రవీణ, రాష్ట్ర భాషా విశారధ, ప్రవేశిక, రాష్ట్ర భాషా, మధ్యమ, ప్రాధమిక మరియు పరిచయ్ సర్టిఫికెట్లు 66 మందికి పంపిణీ చేయడమైనది.
