Telangana

‘స్ట్రెయిన్‌’పై అప్రమత్తంగా ఉన్నాం: డా.శ్రీనివాస్‌

హైదరాబాద్‌: యూకేలో కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు వైద్య, విద్య సంచాలకులు డా.రమేశ్‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త రకం వైరస్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తం అయ్యారని శ్రీనివాస్‌ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: