స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తరలిరండి.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తరలిరండి.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ నిర్వహించే సభ కు తరలి రావాలని ఆ పార్టీ పక్షనేత, 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 31 మద్యాహ్నం 2గంటలకు స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉక్కు ఉద్యమానికి మద్ధతుగా చేపట్టబోయే భారీ బహిరంగ సభకు తరలిరావాలని మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆయన ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటికరణ చేయకుండా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ పరం అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనుక పడుతుందన్నారు. ఎంతో మంది నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ నిర్వహించే సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఉక్కు ఉద్యమానికి బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పెసల శ్రీను, మళ్ల రవి, పీతల తిరుమల, పాలి సందీప్, పీతల భానుప్రకాశ్, నక్క మహేష్, పీతల కిషోర్, గొలగాని ఆనంద్, డొక్కరి అప్పలసూరి పాల్గొన్నారు