సునీల్ శర్మ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కుర్చీల పంపిణీ.

సునీల్ శర్మ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కుర్చీల పంపిణీ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ టు మధురవాడ సునీల్ శర్మ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎలిమెంటరీ, హై స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ కూర్చొనుటకు కుర్చీలు లేవని గ్రహించి మంచి మనసుతో 7 వ వార్డు వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు 20 కుర్చీలను బహుకరించారని తెలుపుతూ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా మహేశ్వరి, గేదల సన్యాసిరావు కృతజ్ఞతలు తెలిపారు.7వ వార్డు వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ సునీల్ శర్మ కాలనీ ఉన్నత పాఠశాల విద్యాలయం లో విద్యను బోధించే పాఠశాల ఉపాధ్యాయులకు కుర్చీలు లేక పోవటం గతంలో పాఠశాలకు వచ్చినప్పుడు చూసి తెలుసుకొని పాఠశాలకు బుధవారం 20 కుర్చీలు బకహుకరించటం జరిగిందని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యశించాలని నా ఆకాంక్షని విద్యార్థులకు తెలిపారు. సి. ఎమ్ జగన్ ఒక మేన మామల విద్యార్థులకు అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పిస్తూ వున్నారని తెలిపారు. పాఠశాల లో సమస్యలను తెలుసుకొని మినిస్టర్ అవంతి దృష్టికి తీసుకు వెళ్లి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉమా మహేశ్వరి, గేదల సన్యాసిరావు,7వ వార్డు వైస్సార్సీపీ మహిళా నాయకురాలు చేకూరి రజని, రాజమ్మ దేవి, పాఠశాల కమిటీ చైర్మన్ సనపల నీలమ్మ, వైస్ చైర్మన్ పెంకి శంకర్, కో ఆప్షన్ సభ్యులు పుక్కళ్ళ యల్లాజీ,చైర్మన్ కక్కల శిరీష, వైస్ చైర్మన్ పడాల ప్రసాద రావు కో ఆప్షన్ వేగి రామిరెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.