సిద్దేశ్వరరం గ్రామ గిరిజనులను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలి : సిపిఐ

సిద్దేశ్వరరం గ్రామ గిరిజనులను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలి : సిపిఐ
క్యాపిటల్ వాయిస్, కర్నూలు జిల్లా ప్రతినిధి :- శ్రీశైలం ప్రాజెక్టు జూపాడు బంగ్లా మండలం లోని సిద్ధేశ్వరం మజారా గ్రామ గిరిజనులను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలని , వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరుతూ శ్రీశైలంలో ఐటిడిఎ పిఓ రవీంద్రనాథ్ రెడ్డి గకి వినతి పత్రాన్ని సిపిఐ జిల్లా సమితి నాయకులు ఎం.రమేష్ బాబు, కె.నాగిరెడ్డి, డి.ఓబుళయ్య లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూపాడుబంగ్లా మండలలోని సిద్దేశ్వరం మజారా గ్రామ గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న కనీసం నివసించేందుకు ఇళ్లు కూడా లేని దీన పరిస్థితిలో ఉన్నారని వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో గిరిజన అధికారులు దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం అని వారన్నారు.
దళిత గిరిజనుల అభివృద్ధి కోసం పాలక ప్రభుత్వాలు పాటు పడుతున్నాయని ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప వారి వైపు చూసిన పరిస్థితి లేదన్నారు. తక్షణమే గిరిజన శాఖ ఉన్నతాధికారులు సిద్దేశ్వరం గ్రామ గిరిజనుల స్థితిగతులు పై విచారణ చేసి వారిని ఐటీడీఏ పరిధిలోకి తీసుకొని రావాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయినటువంటి రోడ్లు,కరెంటు, నీటి సదుపాయం కల్పించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ టి సి సి పి ఐ నాయకుల కే నాగిరెడ్డి సిపిఐ కార్యదర్శి డి ఓబులయ్య భి ఏఐవైఎఫ్ నాయకుల శివయ్య, ,మల్లికార్జున ఏఐఎస్ఎఫ్ నాయకులు ధనుంజయ, శ్రీరాములు, శ్రీనివాసులు విటమిన్ బిఈ రజిత తదితరులు పాల్గొన్నారు.