“శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి* ఆలయంలో అక్టోబర్ 7వ తేది నుండి *దసరా* పూజలు.

“శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి* ఆలయంలో అక్టోబర్ 7వ తేది నుండి *దసరా* పూజలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం (జివియంసి జోన్ 2 ) మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువై యున్న శ్రీ పంచముఖ ఆంజనేయ
శ్రీ షిర్డీ సాయినాధ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు దసరా ఉత్సవాలు గోడ పత్రిక ఆవిష్కంచడం జరిగింది, ఆలయ ధర్మకర్త పిళ్లా కృష్ణంనాయుడు, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ 07/10/2021 గురువారం నుండి తేది 15/ 10/2021 శుక్రవారం వరకు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు (కరోనా నిబంధనలు అనుసరించి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా) వైభవంగా జరుపుటకు నిర్ణయించడమైనది, కావున అమ్మవారి దసరా నవరాత్రి పూజలలో పాల్గొను భక్తులు ముందుగా ఆలయ గమస్తా ని గాని, ఆలయ కమిటీ సభ్యులను గాని, ఆలయ అర్చకులను గాని సంప్రదించి తగు రసుం చెల్లించి !రశీదు పొంది, తేది 07/10/2021గురువారం* నుండి తేది 15/10/2021శుక్రవారం వరకు జరుగు దసరా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.