వైస్సార్ కాలనీ లో వెలుగులు నింపుతున్న టీడీపీ 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.

వైస్సార్ కాలనీ లో వెలుగులు నింపుతున్న టీడీపీ 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ టు :మధురవాడ ,బుధవారం కొమ్మాది వైస్సార్ కాలనీలో జీవీఎంసీ 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత,టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణ్ రావు పర్యటించారు.గతంలో కాలనీ ప్రజలుకు ఇచ్చిన హామీలో భాగంగా కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న క్రింది రోడ్డులో విద్యుత్ స్తంభాలుకు మరియు కాలనీ లో రోడ్డు మరమ్మత్తులు డ్రైనేజి కోసం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కమీషనర్ సృజన కి వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆ వినతిపత్రం ని సంబందిత అధికారులు కి వెను వెంటనే పనులు మొదలుపెట్టమని ఆదేశాలు జరిచేశారు. ఇందులో భాగంగానే ఈరోజు నూతన విద్యుత్ స్తంబాలు ని వెయ్యటం జరుగుతుంది. రానున్న రోజుల్లో వైస్సార్ కాలనీ ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కార్పొరేటర్ మొల్లి హేమలత కాలనీ ప్రజలకు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు ఓలేటి శ్రావణ్, నూకరాజు, కోసురు మాధవ్,నాయుడు, తోట నరేంద్ర, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.