Politics

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన.. ఎవరెవరంటే ?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాని వైసీపీ విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. పరిశీలనలో ఆరుగురి పేర్లు ఉన్నట్టు సమాచారం. ఆరు ఎమ్మెల్సీ ఖాళీలకు మార్చి 15న ఎన్నికలు జరుగునున్నాయి. ఇక ఈ జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ గా రెండో సారి అవకాశం ఇస్తున్నట్టు చెబుతున్నారు. అలానే చిత్తూరు జిల్లా నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు. ఆయన మరణంతో ఆయన తనయుడికి మండలిలో వైసీపీ హైకమాండ్ అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు. అలానే కర్నూలు జిల్లాకు చెందిన చల్లా భగీరధ రెడ్డికి కూడా అవకాశం కల్పించినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మరణంతో ఆయన తనయుడుకి జగన్ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇక విజయవాడ నుంచి కార్పోరేటర్ మహ్మద్ కరీమున్నిసాకి అవకశం కల్పించినట్టు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 56 వ వార్డు కార్పోరేటర్ గా చేసిన కరీమున్నిసాకి ఈ సరి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్టు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ కి అలానే సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు కూడా అవకాశం కల్పించనున్నట్టు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: