Andhra PradeshVisakhapatnam
వైజాగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్ వి కే సినిమా ప్రొడ్యూసర్ మరియు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్
వైజాగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్ వి కే సినిమా ప్రొడ్యూసర్ మరియు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
వైజాగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టూడియో ను వైసీపీ నగర అధ్యక్షులు ,ఎస్ వి కే సినిమా ప్రొడ్యూసర్ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు ఉషోదయా కూడలి సమీపంలో గల వినిస్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ విశాఖ రాజధాని గా అనేక సౌకర్యాలు విస్తరిస్తున్న నేపద్యంలో సినీరంగానికి సంబంధించిన సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా స్టూడియో ను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు. హైదరాబాద్ తరహాలో మహా విశాఖ నగరంలో డబ్బింగ్, రికార్డింగ్ పలు అధునిక సాంకేతిక తో స్టూడియో నెలకొల్పిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్టార్ మేకర్ సత్యానంద్ , రైటర్ మరియు ఫిల్మ్ ఆర్టిస్ట్ బాదంగీర్ సాయి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


