వీధి దీపాలు ఏర్పాటు చేయించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పోతిన హనుమంతరావు.

వీధి దీపాలు ఏర్పాటు చేయించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పోతిన హనుమంతరావు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
5వ వార్డు వై ఎస్ ఆర్ నగర్ లో గత 12 సంవత్సరాలుగా కాలనీ ప్రారంభం నుంచి వైస్సార్ నగర్ రెండో వీధి లో వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు.
దానివల్ల కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోలేదు.
కానీ వైస్సార్సీపీ ప్రభుత్వ హయాములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహకారంతో. ఆ వీధికి 8 వీధిదీపాల స్తంభాలకు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పోతిన హనుమంతరావు పట్టుదల కృషితో కార్యదీక్షతో నిధులు మంజూరు చేయించి బుధవారం వీధి దీపాలు స్తంభాలను ఏర్పాటు చేసరూ.వైస్సార్సీపీయువ నాయకులు పోతిన సురేష్ పర్యవేక్షణలో బుధవారం వీధి దీపాల స్తంభాల ఏర్పాటు పనులు జరిపించారు.
ఈ కార్యక్రమంలో వై ఏస్ ఆర్ నగర్ నాయకులు వంకర అప్పారావు (యస్. సి సెల్ అధ్యక్షులు) లక్ష్మి , కొండమ్మ, దేవా, అప్పారావు నాయుడు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.