వీఆర్ఏ ల వేతనాలు పెంచాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
వీఆర్ఏ ల వేతనాలు పెంచాలని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
వీఆర్ఏలకు వేతనం 21,000 ఇవ్వాలని, పే స్కేల్ ప్రకటించాలని, నామిని లుగా పని చేస్తున్న వారందరికీ వీఆర్ఏ లుగా నియమించాలని, అర్హులైన వీఆర్ఏ లకు విఆర్ఓ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎ పి వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీరికి సిఐటియు నాయకులు జగన్మోహన్, గంగప్ప, ఫాజిల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2017 లో వీఆర్ఏ లు చేస్తున్న ధర్నాకు హాజరైన తను ముఖ్యమంత్రి అయితే కనీస వేతనం తో పాటు ప్రమోషన్లు ఇస్తానని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సిపి అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా వీఆర్ఏలకు ఇచ్చినా హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏ లలో చాలా మంది అనారోగ్యంతో, వయసు పైబడటం తో విధులు నిర్వర్తించి లేకపోవడంతో వారి వారసులు పని చేస్తున్నారన్నారు. నామినీ లుగా పనిచేస్తున్న వారిని విఅర్ఏ లుగా నియమించాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న ధరలను ప్రాతిపదికగా తీసుకొని 21,000 వేతనం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు టీ.నరసింహులు, పెద్దన్న, శివప్రసాద్, రామప్ప, శివరాం రెడ్డి, కిష్టప్ప,శంకరప్ప,డివిజన్ అధ్యక్షులు ప్రసాద్, ఉపాధ్యక్షులు గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.