Andhra PradeshVisakhapatnam
విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కలిసారు. బుధవారం పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితమే స్వరూపానందేంద్ర స్వామి విశాఖ చేరుకున్నారు. దీక్షానంతరం విశాఖకు వచ్చిన స్వామీజీ ఆశీస్సుల కోసం ఆయన విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు.