విశాఖ లోని గాయత్రి విద్యా పరిషత్ వైద్య కళాశాల ఆసుపత్రి అరుదైన రికార్డు
విశాఖ లోని గాయత్రి విద్యా పరిషత్ వైద్య కళాశాల ఆసుపత్రి అరుదైన రికార్డు సాధించింది. మాటలు రాని ఎనిమిదేళ్ల ఇద్దరు బాలికలకు అత్యంత శక్తివంతమైన వినికిడి మిషన్ కు కూడా సాధ్యం కాని మొండి చెముడును నయం చేసే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ మేరకు సోమ వారం కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ ఎం వి అప్పారావు మాట్లాడుతవినికిడి దోషాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది.ఐదేళ్లలోపు చిన్నారులకు అత్యంత ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ శాస్త్ర చికిత్స గాయత్రి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగే అవకాశం ఉంది. ఏమాత్రం వినికిడి దోషాలున్న పిల్లలు మాట్లాడని పిల్లలకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు గాయత్రి ఆస్పత్రిలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.గాయత్రి విద్యాసంస్థల కార్యదర్శి ఆచార్య పి సోమరాజు మాట్లాడుతూ త్వరలో ఆస్పత్రిలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెఫ్రాలజీ ,న్యూరాలజీ, కార్డియాలజీ అంకాలజీ విభాగాలు నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు వివిధ పరీక్షలకు సంబంధించి 20 శాతం వరకూ రాయితీ ఇస్తున్నామని తెలిపారు. బాలికకు ప్రస్తుతం స్పీచ్ థెరపీ జరుగుతుంది వివరాలు బాధితురాలు శ్రీకాకుళం జిల్లా చెందిన మహన్య, మనస్వి కాలవలు.మొండి చెముడుతో బాధపడేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్కి ఒక్కొక్కరికి 6.5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ చిన్నారులకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు గాయత్రీ వైద్య కళాశాల చర్యలు ఎం వి అప్పారావు బృందం ఆపరేషన్ నిర్వహించారు .డాక్టర్ సూర్య ప్రకాష్ ,డి.అర్. కె రాజు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నిహారికలు ఆపరేషన్ చేశారు. గుంటూరు కి చెందిన ప్రముఖ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఆచార్య డాక్టర్ వై సుబ్బారాయుడు సారథ్యం వహించారు రు వైద్య నిపుణులు ఆచార్యులు డాక్టర్ కూర్మనంద్, డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ పద్మావతి తదితరులు ఆపరేషన్ లో పాల్గొన్నారు . మత్తు వైద్య కళాశాల నిపుణులు ఆడియాలజిస్ట్ కుమారి అరుణ స్పీచ్ థెరపీ అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి రంగారావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు, ఆచార్య పి.వి. శర్మ, ఆచార్య పి వెంకటరావు పాల్గొన్నారు..