విద్యుత్ చార్జీలు తగ్గించాలి:కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

విద్యుత్ చార్జీలు తగ్గించాలి:కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి నెల్లూరు :- సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ సిటీఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.. ఒక్క చాన్స్ ఇస్తే పైసా పన్నులు పెంచకుండానే రాష్టాన్ని అభివృద్ది చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ప్రజలపై పన్నుల భారం మోపారని ధ్వజమెత్తారు.. కిసాన్ నగర్ లోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న సబ్ స్టేషన్ ఎదుట 4,5,6 డివిజన్లకు చెందిన టీడీపీ నేతలు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు.. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించకపోతే మంత్రి అనీల్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.. వందల కోట్లతో విలాసవంతమైన భవంతులు నిర్మించుకున్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు ప్రజలు కరెంట్ చార్జీల బాధలు ఏం తెలుసని ప్రశ్నించారు.. విడతలవారీగా ఆందోళనలు చేస్తున్నామని, ఈలోపు కరెంట్ చార్జీల తగ్గింపుపై ప్రభుత్వం, మంత్రి అనీల్ గానీ ప్రకటన చెయ్యకపోతే ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు సైతం వెనుకాడమని కోటంరెడ్డి హెచ్చరించారు. ఓ వైపు మంత్రులు, ఎమ్మెల్యే వందలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ…ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతుంటే. .దాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వం సామాన్యలపై పన్నుల భారాన్ని మోపుతోందన్నారు.. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందించారు.. జిల్లా ఉపాధ్యక్షులు మధు, పొత్తూరి శైలజ మాట్లాడుతూ.. నిత్యవస వస్తువుల దగ్గర నుంచి గ్యాస్ ధరలు దాకా అన్నింటిని పెంచి సామాన్యులు మూడుపూటల అన్నం తినే పరిస్థితిలేకుండా చేశారని వారు మండిపడ్డారు..ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మమీడాల మధు,పొత్తూరు శైలజ,రామనహ్య నాయుడు,శ్రీరాములు, రాజా,కృష్ణ,గంగాధర్, సంకరహ్య, కాలందర్ రెడ్డి,ప్రణయ్ రెడ్డి, రేవతి,కోమరగిరి విజయ, మంగమ్మ,శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.టీడీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు.